జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందించారు. కళాకారుడి కి పవన్ కళ్యాణ్ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. కాగా… కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.
Glad to know that Shri @PawanKalyan garu has extended a financial help of Rs 2 Lakhs to traditional Kinnera instrument player Shri Mogulaiah.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) September 5, 2021
సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య గారికి Rs 2 lakhs ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. మీ సహాయం స్పూర్తిదాయకం. pic.twitter.com/3UJEZ0I0kJ