Taj Express : ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలో నడుస్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించకముందే కోచ్‌లోని ప్రయాణికులు బయటకు దూకడం విశేషం.
ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రైలులోని నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది.