తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు…