ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో.. ప్రజలను భయపెడుతూనే ఉంది… తాజాగా, డెల్టా వేరియంట్‌తో ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.. ముఖ్యంగా ఆసీస్‌లోని సిడ్నీ డెల్టా వేరియంట్ దెబ్బకు వణికిపోతోంది.. దీంతో మహమ్మారి కట్టడికోసం కఠినమైన నిబంధనలకు పూనుకుంటుంది ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను మరోమారు పొడిగించింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం… ఇక కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుందని వెల్లడించారు.…