Zomato, Swiggy: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్స్ అయిన స్విగ్గీ, జొమాటోలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వర్షాకాలం కోసం కొత్త నియమాలను తీసుకువచ్చాయి. ఇకపై వర్షం సమయంలో, బ్యాడ్ వెదర్ ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ చేయాలంటే వినియోగదారుదు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే. సాధారణ యూజర్లతో సహా, సబ్‌స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులను కూడా ఇకపై ఒకే విధంగా ట్రీట్ చేయనున్నాయి.