Nobel Prize: ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ మనీని పెంచనున్నట్లు నోబెల్ ఫౌండేషన్ తెలిపింది. నోబెల్ విజేతలకు ఈ ఏడాది అదనంగా మరో 1 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను ఇస్తామని మొత్తంగా 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను(9,86,000 డాలర్లను) అందచేస్తామని శుక్రవారం ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో ప్రైజ్ మనీ పలుమార్లు సర్దుబాటు చేశారు. ప్రస్తుతం ఫౌండేషన్ ఆర్థిక స్థితి బలంగా ఉన్నందుకు ప్రైజ్ మనీని కూడా పెంచినట్లు తెలిపింది