పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్‌లో ఫైనల్ చేరిన తొలి షూటర్ స్వప్నిల్.
బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు.