నిత్యం ఉదయాన్నే అనేక కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను చూస్తునే ఉంటాం. విజయ, దొడ్ల, హెరిటెజ్ ఇలా అనేక రకాల ప్యాకెట్లు మార్కెట్లోని దుకాణాలు, హోటళ్లలో లభిస్తాయి. కానీ ఒక హోటల్‌ల్లో మాత్రం తినుబండరాలతో పాటు ఎస్‌వీఎస్ బ్రాండ్ పేరుతో కల్లు ప్యాకెట్లు పట్టుబడటం ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ సిబ్బందిని అశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా హోటల్‌లో కల్లు అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో సీఐ సుబాష్ చందర్, ఎస్సైలు అఖిల్,…