Today(13-03-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ట్రేడింగ్‌ని శుభారంభం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో ఆ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. దీంతో.. సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఏడాది కనిష్ట విలువలను నమోదు చేశాయి. వివిధ రంగాల్లోని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి.
డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం దివాళా తీసి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావం చాలా దేశాలపై పడుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.