Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాస్ లీకేజ్ కారణంగా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. త్తర చెన్నైలోని తిరువొత్తియూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన అనేక మంది విద్యార్థులు బుధవారం రోజు, అనుమానాస్పద గ్యాస్ లీక్ కారనంగా శ్వాస తీసుకోవడం, తల తిరగడం, వికారం వంటి లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారు.