ICC Fines SuryaKumar Yadav: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ప్రకటన రాజకీయ ప్రేరేపితమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది.