T20 World Cup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతూ తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ముందు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.…
Suryakumar Yadav: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న అతడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ వరకు ఇలాగే ఫామ్ కొనసాగించాలని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆకాంక్షించాడు. తాజాగా అతడు ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు మ్యాక్స్‌వెల్ నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ అంతర్జాతీయ…
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పరుగులు పోటెత్తాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బలమైన పునాది వేయగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. చివర్లో దినేష్ కార్తీక్ కూడా తనదైన చేయి వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు,…
IND Vs SA 1st T20: తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపు రుచి చూసింది. రోహిత్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుటై నిరాశపరిచినా కేఎల్ రాహుల్ (51 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగి…
ICC Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన సూర్యకుమార్ ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు ఆసియా కప్‌లో విఫలమైన బాబర్ ఆజమ్ ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. సెంచరీ చేసినా తన రెండో స్థానాన్ని కోల్పోయాడు. పాకిస్థాన్ ఆటగాడు రిజ్వాన్…
ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివరి టీ20లో మెరుపు సెంచరీతో వీరవిహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకెళ్లాడు. 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్య తన కెరీర్‌లోనే బెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్ నమోదు చేశాడు. టీ20ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ ఐదో స్థానంలో నిలిచాడు. విశేషం ఏంటంటే.. టాప్ టెన్‌లో ఇండియా నుంచి ఉన్న…
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్మన్లందరూ రాణిస్తే.. ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. 10 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న రెండో టీ20లో ఇషాన్ కిషన్‌కు బదులుగా కోహ్లీని ఓపెనర్‌గా దింపాలని కోరాడు. కోహ్లీ లాంటి మేటి ఆటగాడ్ని మూడో స్థానంలో ఆడించొద్దని సూచించాడు. ‘‘విరాట్ కోహ్లీ తుది…
ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టు, మునెపెన్నడూ లేనంత దారుణంగా ఈ సీజన్‌లో రాణిస్తోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళందరూ దాదాపు విఫలమయ్యారు.. ఒక్కరు తప్ప! అతడే.. సూర్య కుమార్ యాదవ్. మొదట్నుంచి ముంబై జట్టులో ఇతనొక్కడే బాగా ఆడుతున్నాడు. చాలా కసితో ఆడుతున్న ఇతగాడు, జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్మ్సన్. అలాంటి సూర్య కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ సీజన్…