పెగసస్ స్పై వేర్ అంశంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పెగసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. మాల్‌వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందని, టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిందని సీజేఐ వెల్లడించారు. తుది నివేదికను సమర్పించేందుకు టెక్నికల్ కమిటీ సమయం కోరడంతో సీజేఐ అంగీకరించారు. ఈ నేపథ్యంలో.. మొబైల్…