హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమను మానసికంగా, లైగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు.
సిద్దిపేట జిల్లా బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ మానవత్వం చాటుకున్నాడు. నిన్న రాత్రి మిడిదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన నాగరాజు సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో బ్యాగు మర్చిపోయాడు. దీంతో బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ ఆబ్యాగ్ ను చూసాడు. ఆబ్యాగ్ లో ఏముందో అని పరీక్షించాడు. బ్యాగ్ లో రూ. 50వేలు వుండడంతో ఖంగుతిన్నాడు. ఎవరో మర్చిపోయారని, బ్యాగును యజమానికి తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ..బ్యాగ్ యజమాని అడ్రస్…