తెలంగాణలో లాక్‌డౌన్‌ను పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డైట్ కాలేజీలకు కూడా 15 వరకు సెలవులు పొడిగించారు. ఇక తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఎంపీ రఘురామరాజును రమేష్ ఆసుపత్రి తరలింపు, అక్కడ వైద్య పరీక్షల నిర్వహణపై సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, సుప్రీంకోర్టు.. రఘురామను ఆస్పత్రికి తరలింపు అంశంపై ఉత్తర్వులు ఈరోజే ఇచ్చిందని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు ఏఏజీ..…
పదవ తరగతి పరీక్షలు రద్దైనాయి. దిగువ తరగతులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింనందున ఆన్లైన్ క్లాసులు కూడా వినే స్థితిలో విద్యార్థులు లేరు.ఉపాధ్యాయులు మాత్రం ప్రతిరోజూ పాఠశాలలకు హాజరౌతున్నారు. ఈ నేపద్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించి, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయటం సమంజసంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి వినూత్న విద్యా పధకాన్ని ప్రారంభించటానికి…