ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కారణంగా పరభాషా చిత్రాలను మాతృభాషలో చూడగలిగే అదృష్టం తెలుగు సినిమా ప్రేమికులకు లభిస్తోందంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొన్ని చిత్రాలను కమర్షియల్ యాస్పెక్ట్ లో నిర్మాతలు డబ్ చేయడానికి తటపటాయించే సమయంలో ఆహాలో వాటిని చూడగలగడం అదృష్టం అనే చెప్పాలి. తాజాగా ఆహా ఓటీటీలో టొవినో థామస్ కాలా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషిలో మంచి, చెడు గుణాలు కలబోసి ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో…