తెరపై ‘సూపర్’ అనిపించుకోలేదు కానీ, టాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల వేడుకల్లో మాటలతో కోటలు కడుతూ ‘సూపర్’ అనిపించుకుంటూ ఉంటారు సుమ కనకాల. యాంకర్స్ లో సుమ ‘సూపర్ స్టార్’ అనే చెప్పాలి. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండీ వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారామె. సుమ నోట పరుగులు తీసే పదబంధాలు ప్రేక్షకులను పరవశింపచేస్తూ ఉంటాయి. తేనెలూరే తెలుగు ఆమె గళంలో గలగల గోదారిలా ప్రవహిస్తుంది. చిత్రమేమిటంటే- సుమ మాతృభాష తెలుగు కాదు. అయినా తెలుగు…
(మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు)కోటలు దాటే మాటలు అంటారు కానీ, మాటలతో కోటలు కట్టిన మేటి మాటకారి సుమ కనకాల. తెలుగునాట వ్యాఖ్యాతలు సైతం సెలబ్రిటీ స్టేటస్ చవిచూస్తారని నిరూపించిన ఘనత సుమ సొంతం. నటి కావాలని పాతికేళ్ళ క్రితం బయలు దేరిన సుమ, వెండితెరపై అంతగా వెలగలేదు. కానీ, వందలాది చిత్రాలు వెండితరపై వెలగబోయేముందు జరిగే ఉత్సవాలలో మాత్రం సుమ గాత్రం విజయనాదం చేస్తూనే ఉంది. ఆమె వ్యాఖ్యానంతో సాగిన సినిమా ఉత్సవాలు, విజయోత్సవాలు…