పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత తృణమూల్ నుంచి వచ్చిన కొంతమంది నేతలు తిరిగి ఆ పార్టీలో చేరిపోయారు. తాజాగా మాజీకేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా తృణమూల్‌లో చేరడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌ను తప్పించి ఆ స్థానంలో ఎంపీ సుకంత మజుందర్‌ను నియమించింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ నుంచి పక్కకు తప్పుకున్న దిలీప్ ఘోష్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా…