(ఆగస్టు 15న సుహాసిని పుట్టినరోజు) తెలుగునాట పుట్టకపోయినా, తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు ఎందరో కళాకారులు. వారిలో సుహాసిని స్థానం ప్రత్యేకమైనది. నిజానికి తమిళ చిత్రాలతోనే అరంగేట్రం చేసినా, తరువాత తెలుగు చిత్రాలతో సూపర్ హీరోయిన్ గా జేజేలు అందుకున్నారు సుహాసిని. తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన తరువాతే ‘సింధుభైరవి’తో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచారామె. తెలుగు చిత్రాల వల్లే తనలోని నటి మెరుగు పడిందని సుహాసిని గర్వంగా చెప్పుకొనేవారు. ఆమె కళాకారుల కుటుంబంలోనే…