మెజీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, జబర్దస్త్‌తో కమెడియన్‌గా గుర్తింపు సంపాదించిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సుధీర్ హీరోగా పలు సినిమాలు చేశాడు. అందులో కొన్ని బ్రేక్ ఈవెన్ కూడా అయ్యాయి. ఇప్పుడు సుధీర్ కెరీర్‌లో హీరోగా ఐదవ సినిమా అనౌన్స్‌మెంట్ రాబోతోంది. రేపు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుడిగాలి సుధీర్ ఇప్పటివరకూ చేసిన నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే. తర్వాత…