Stock Market Highlights: ఈ వారంలో ఒక రోజు వినాయకచవితి పండుగ రావటం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. ఎక్కువ శాతం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కావటం, దానికి భిన్నంగా స్వల్ప లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపట్లోనే మళ్లీ నష్టాల్లోకి జారుకోవటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికితోడు తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.
Stock Market Analysis: సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కనబరిచిన పనితీరును 'వెల్త్ ట్రీ గ్రూప్' ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కగా విశ్లేషించారు. వివిధ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలను, స్టాక్ విలువల హెచ్చుతగ్గులపై అమెరికా వడ్డీ రేట్ల ప్రభావాన్ని వివరించారు. ఏయే సంస్థల స్టాక్స్ బాగా రాణించాయో చెప్పారు.