Yadamma Raju: జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు స్టెల్లాతో వివాహం అయ్యింది. వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం .. అవి వైరల్ అవ్వడంతో ఆమె కూడా ఫేమస్ అయ్యింది.