Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు.