కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని సదాశివ నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అవమానించారనే ఆరోపణలతో సంఘ్ పరివార్ మూకలు రెచ్చిపోయారు. బెలగావిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సంగూలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బస్సులపైకి, కార్లపైకి రాళ్ళు విసిరుతూ భయాందోళనలు సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో బంద్ కూడా నిర్వహించారు. సంఘ్ పరివార్ మూకల అరాచకాలను నిరసిస్తూ మైసూరులో యువ జనతా…