ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపడమే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వరకు వచ్చింది. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు తీసుకున్న అనంతరం దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. “1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లతో పాటు…