శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పని దొరకకపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకక యువకులు నేరాలకు పాల్పడుతున్నారు. లంకలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు.
Sri Lankan crisis- women into prostitution: శ్రీలంకలో రాజకీయ అధికారం మారినా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనం అయిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం పెద్దపెద్ద క్యూల్లో నిలబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది.