దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు లభించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ గొట్టం కాజాను నేటి తరం గుర్తించేందుకు ప్రత్యేక పోస్టల్ కవర్‌ను తపాల శాఖ విడుదల చేసింది. 1891లో తొలిసారిగా కాకినాడ కాజాను తయారుచేశారు. కోటయ్య అనే వ్యక్తి తొలిసారిగా ఈ కాజాను తయారు చేసి కీర్తిని పొందారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది.…