సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్‌లో తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్…