ఇంటర్మీడియట్ పరీక్షలపై తన ఆదేశాలను మరోసారి పునరుద్ఘాటించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఐసీఎస్ఈ మరియు సీబీఎస్‌ఈ విధానం ప్రకారం… జులై 31వ తేదీ లోగా రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.. ఈ విషయంలో ఏ ఇతర అంశాలను.. వాజ్యం కానీ.. దరఖాస్తులను కానీ విచారించేదిలేదని పేర్కొన్న ధర్మాసనం.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.. అయితే, 10 రోజులలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనానికి నివేదించారు ఏపీ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది…