సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణలో కేంద్ర క్రిమినల్ సర్వీస్ (CIS) పోలీసులు కీలక వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ను ఒకరోజు కస్టడీకి తీసుకుని వివరమైన విచారణ చేపట్టారు.
Srushti Fertility Scam : హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై ఘోర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల వద్ద ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుని, సరోగసి పేరుతో విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆడపిల్లలను పెంచే ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుండి ఏజెంట్ల సహకారంతో పిల్లలను సేకరించిన నమ్రత, మగ పిల్లలయితే ఒక్కొక్కరిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మినట్లు సమాచారం. డాక్టర్ నమ్రత దగ్గరకు…