నేటి నుండి శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షలతో క్షేత్రపరిధిలో 7 రోజులపాటు వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 18…
కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన…
శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కార్తీకా మాసం. రానున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీకమాసం సందర్భంగా కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.5వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. కరోనా మహమ్మారి కారణంగా స్పర్శ దర్శనం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కాగా.. దసరా మహోత్సవాల ప్రారంభం నుంచి తిరిగి.. సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది శ్రీశైలం దేవస్థానం.. అంటే, అక్టోబర్ 7వ తేదీ నుంచి భక్తులందరికీ స్పర్శ దర్శనం అవకాశం ఇవ్వనున్నట్లు టెంపుల్ అధికారులు పేర్కొన్నారు. కాగా, వారంలో 4 రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు సర్వదర్శనం…