Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 27వ తేదీన హుండీ లెక్కింపులో చిల్లర సంచులను చంద్రావతి కళ్యాణ మండపంలో దేవస్థానం క్యాషియర్లు మంజునాథ్, శ్రీనివాసులు మరిచిపోయారు.
శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలు జరిగాయి.. ఏకంగా 95 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో, శ్రీశైలం దేవస్థానంలో 95 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగినట్టు అయ్యింది.