T20 World Cup Controversy: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లాభాల కోసమే తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నఖ్వీ, తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందనే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.