అంతా శాఖాహారులే..... కానీ... బుట్టలోని రొయ్యలు మాత్రం మాయం. ప్రస్తుతం రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ కేసుకు సంబంధించి పేర్లు బయటికి వచ్చిన నేతలంతా... మాకు సంబంధం లేదంటే మాకు లేదంటున్నారు. కానీ... పెరోల్ మాత్రం వచ్చింది, రచ్చ అయ్యాక మళ్లీ శ్రీకాంత్‌ని లోపలికి నెట్టారు. కానీ.. ఇక్కడ అసలు దోషులెవరన్నది బిగ్ క్వశ్చన్. ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న, అంతకు ముందు కూడా…