ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్కూల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడారు. ‘‘సాధారణంగా చిరంజీవి కొత్త సినిమాలకు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ కనిపించని విధంగా నేడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ‘నో అడ్మిషన్స్’ బోర్డులు కన్పిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో…