ఆ జిల్లాలోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్‌పై కేడర్ రుసరుసలుశ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్‌లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్. పార్టీ కోసం…