తండ్రి సరసన నాయికగా నటించిన భామతో తనయుడు రొమాన్స్ చేయడం అన్నది నిస్సందేహంగా సదరు హీరోయిన్ కు ఓ క్రెడిట్ అనే చెప్పాలి. తల్లితోనూ, ఆమె కూతురితోనూ నాయకునిగా నటిస్తే అది తప్పకుండా ఆ హీరోకు క్రెడిట్ కాకమానదు. మొదటి విషయానికి వస్తే – తండ్రి, కొడుకు ఇద్దరితోనూ రొమాన్స్ చేసిన నాయికలు ఉన్నారు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగానే కనిపిస్తున్నారు. కానీ,ఆ రోజుల్లో తండ్రి హీరోయిన్ తో తనయుడు రొమాన్స్ చేయడమంటే ఓ విశేషంగా ఉండేది. అందునా…