మణికొండలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్‌లోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం మణికొండ ప్రాంతంలోని మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో ఉంది. ఇది 500 సంవత్సరాల పురాతన ఆలయం, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలసి పూజలందుకుంటున్నారు. హనుమంతులవారితో పాటు శ్రీ వీరభద్ర స్వామి, భోళా శంకరుడు కూడా స్వయంభూ దేవతలుగా పూజించబడుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామలవారి ఆలయం కూడా ఉంది. పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాలను జరుపుకునేందుకు ఓ విస్తృతమైన…