శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు ముందు, ట్రస్ట్ ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2023.
అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున 'ప్రాణ ప్రతిష్ఠ'కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని భావిస్తున్నామన్నారు.