Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చిట్‌ఫండ్స్ సంస్థల కార్యాలయాలపై ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దాడులు చేస్తోంది. విజయవాడలోని నాలుగు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మార్గదర్శితో పాటు శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ ఫండ్స్ కార్యాలయాల్లోనూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా పలు చిట్‌ఫండ్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. ఈ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని…