టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్‌లో కీలక దశలో ఉంది. వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ, ఆమెకు సరైన హిట్ మాత్రం దొరకలేదు. ‘ధమాకా’ తర్వాత వచ్చిన సినిమాలు ఆమె నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అందుకే ఇప్పుడు శ్రీలీల తన తదుపరి సినిమా ‘పరాశక్తి’ మీద నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమాను ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దు’ వంటి భావోద్వేగపూరిత సినిమాలతో…