తెలుగు వెండితెరపై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అచ్చతెలుగు అమ్మాయి శ్రీలీల. కెరీర్ స్టాటింగ్ లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తన కెరీర్‌లో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు శ్రీలీల అంటే కేవలం గ్లామర్, డ్యాన్స్‌లకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, తాజాగా విడుదలైన ఆమె తమిళ చిత్రం ‘పరాశక్తి’ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.…