గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది.. పని తక్కువగా ఉండేది.. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు.. కాగితాల మీద మాత్రమే అగ్రిమెంట్లు కనబడేవి అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం…