బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వరంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. సుమారు 3,500 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్‌లో బ్యాంక్ 505 ప్రొబేషనరీ ఆఫీసర్లను (POలు) నియమించుకుందని, అదే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ జరుగుతోందని SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (HR), చీఫ్ డెవలప్‌మెంట్…