ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం అని టీఎస్ హైకోర్టుకు డిహెచ్ తెలిపారు. మొదటి దశ కరోనా సమయంలో ప్రయివేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించాము. ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తాము. నిన్న ఒక హాస్పిటల్ 17 లక్షలు బిల్ వేసింది. మేము చర్యలు తీసుకుని మాట్లాడితే 10 లక్షలు పేషంట్ వారికి రిటర్న్ చేశారు…