Special Story on Vinayaka: చదువుకోవాలనే మనసు, అమితాసక్తి ఉండాలే గానీ ప్రతి వ్యక్తి జీవితమూ ఒక విలువైన పుస్తకమే. పుస్తకాన్ని పఠించి మస్తకాన్ని మథిస్తే విజ్ఞానం పుడుతుంది. విఘ్నేశ్వరుడి పుట్టుక, లీలల విశేషాలు దీనికో చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ గణపతి.. సకల కళలకు, శాస్త్రాలకు అధిపతి. ఈ దేవదేవుడు.. బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడు. అందుకే ఈ పార్వతీ పుత్రుడికి ప్రతి క్రతువులో ప్రథమ పూజ చేస్తారు.