నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ 8లో దగ్గుబాటి రానా గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ ఎప్పటిలాగే తన ఎనర్జీ లెవెల్స్ తో ఉత్సాహంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సారి ముందుగా ప్రేక్షకుల్లోని వారితో ‘అన్ స్టాపబుల్’ గురించి చర్చిస్తూ ఈ ఎపిసోడ్ ను ఆరంభించడం విశేషం! రోజా అనే అమ్మాయి తాను పట్టుదలతో ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నదో వివరించగా… తనదీ, రోజాతో బెస్ట్ కాంబినేషన్…