అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి పెరగడంతో దక్షణిమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ స్టేషన్‌ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలుస్తోంది. జనవరి…
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఓ విషయాన్ని ప్రకటించింది. 6 రోజుల పాటు రాత్రి పూట రిజర్వేషన్ సౌకర్యం లేదని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ ఉండదని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవలకు అంతరాయం కలుగుతుందని ఇది ప్రయాణికులు గమనించాలని కోరింది. అంతేకాకుండా కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. రైల్వే డేటా…