Gun Violence: దక్షిణాఫ్రికాలోని రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన భయంకర కాల్పులు స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ దారుణ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికన్ పోలీస్ సర్వీస్ (SAPS) తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 4:15 గంటల తర్వాత ఈ హత్యాకాండ చోటుచేసుకుంది. అయితే పోలీసులకు సమాచారం ఉదయం 6…