(ఏప్రిల్ 17న సౌందర్య వర్ధంతి) కొందరిని చూడగానే, మనకు బాగా పరిచయం ఉన్నవారిలా కనిపిస్తారు. ఇక వారిలో అందం, చందం రెండూ ఉంటే, వారికి మరింత దగ్గరగా కావాలనీ భావిస్తాము. కన్నడనాట పుట్టినా, తెలుగు చిత్రాలలో భలేగా మెరిసిన అందాల అభినేత్రి సౌందర్యను చూసి మన జనం అలాగే భావించారు. ఆమె ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ…